Home » New Delhi
మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. గత రాత్రి కాంగ్రెస్ నేత మాణిక్‌రావు ఠాక్రే సమక్షంలో హస్తం పార్టీలో చేరారు. తిరిగి ఈరోజు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో మరోసారి పార్టీ కండువా కప్పుకున్నారు.ఇందులో భాగంగా కాసేపట్టి క్రితమే కోమటిరెడ్డి ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ గురువారం ఉదయం 8 గంటలకు వాయు నాణ్యత 256 పాయింట్లుగా రికార్డ్ అయి ఎయిర్ క్వాలిటీ పేలవంగా మారింది. దీంతో కేజ్రీవాల్ సర్కార్ అప్రమత్తం అయింది. ఇవాళ్టి నుంచి మళ్లీ "రెడ్ లైట్ ఆన్, గాడీ ఆఫ్" ప్రచారం ప్రారంభించనున్నారు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పడితే ఇంజిన్ ఆపేయాలని చెప్పడం ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశం.
అభివృద్ధిచెందిన భారతదేశం కోసం ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని, కులతత్వం, ప్రాంతీయతత్వం సమాజంలోని సామరస్యానికి హాని చేస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. డవలప్డ్ ఇండియా కోసం ప్రతి ఒక్కరూ 10 ప్రతినలు బూనాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు నవరాత్రి, విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక ఈ పండుగ అని అభివర్ణించారు. అయోధ్యలో భవ్య రామాలయాన్ని చూసే భాగ్యం మనకు కలగనుందని, వచ్చే రామనవమి అయోధ్యలోనే జరుగుతుందని అన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఓ ఫేమస్ రష్యన్ యూట్యూబర్(Russian YouTuber) పై వేధింపుల(Harassment) ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR)లో క్రాకర్స్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని ఢిల్లీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. దీపావళి సందర్భంగా ఏర్పడే వాయు కాలుష్యాన్ని అరికట్టడమే ధ్యేయంగా ఢిల్లీ, పంజాబ్, హరియాణా, యూపీ, రాజస్థాన్ రాష్ట్రాల పర్యావరణ శాఖ మంత్రులతో కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్(Bhupender Yadav) ఇవాళ సమావేశం నిర్వహించారు.
మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులపై బీజేపీ కసరత్తు చేపట్టింది. మరికాపట్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థుల జాబితాల విడుదలకానుంది. అభ్యర్థుల ప్రకటనపై ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. మూడు రాష్ట్రాల అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ చర్చించిందని తెలిపారు. తెలంగాణ నుంచి 50 పైగా స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి చేసి కేంద్ర ఎన్నికల కమిటీకి అందించామని.. ఏ క్షణంలో అయినా అభ్యర్థుల ప్రకటన ఉంటుందని అన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే బడుగు బలహీన వర్గాల నుంచి సీఎం అభ్యర్థిని ప్రకటించాలని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్‌రావు అన్నారు.
'ఒక దేశం ఒకే ఎన్నికలు' నిర్వహణపై విధివిధానాలను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ తదుపరి సమావేశం ఈనెల 25న జరుగనుంది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన తొలి అధికారిక సమావేశం ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీలోని ఆయన నివాసంలో జరిగింది.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టులో రాజకీయ కక్ష ఉందని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ వ్యాఖ్యలు చేశారు.